Pages

Wednesday, 12 September 2012

శ్రీ కనకదుర్గ స్తవం - తాత్పర్యర్థము



సుందరీ ముఖీ నమో నమో 
పద్మనయనీ నమో నమో 
చందన కుంకుమాలంకృత వదనీ నమో నమో 
అభయ ప్రదాయని నమో నమో 
శక్తి స్వరూపిణి నమో నమో 
జగజ్జననీ నమో నమో 
కరుణాసాగరి నమో నమో 
సౌభాగ్యదాయని  నమో నమో 
సింహవాహిని నమో నమో 
త్రిశూల పాణి నమో నమో 
వర ప్రదాయని నమో నమో 
శ్రీ కనక దుర్గ నమో నమో 

తాత్పర్యర్థము : సుందరమైన ముఖము గలది. పద్మాలవంటి విశాలమైన  నేత్రాలు గలది. చందన కుంకుమాదులతో అలంకరించబడినది. అభయాన్నిచ్చేది, శక్తి స్వరూపిణి, ముల్లోకాలను పాలించేది, కరుణా సముద్రురాలు, సౌభాగ్యాలనొసగునది, సింహ వాహనం గలది, త్రిశూలాన్ని ధరించినది, కోరిన వరాలను ఇచ్చేది అయిన శ్రీ కనకదుర్గ తల్లికి వందనాలు. 

No comments:

Post a Comment