Pages

Tuesday, 11 December 2012

ఒక యోగి ఆత్మ కథ - నా అభిప్రాయం


నా అభిప్రాయం

నేను సాధారణంగా మనుషులనే నమ్మను. అంటే దేవున్నీ, దయ్యాలను నమ్ముతానని కాదు. అలాగని నమ్మననీ కాదు. అలాంటి నేను (సన్యాసులను సన్నాసులు అనుకునే నేను ) ఒక యోగి  ఆత్మ కథ చదివి నమ్మి, దానితో ప్రభావితమై ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయగాలిగానంటే మరి ఆ సాధువు వ్రాసింది నిజమేనా?!! నేనూ నిజమయ్యే ఉంటుందని నమ్మాలనుకుంటాను. మరి ఎవరైనా నమ్మి ఉంటారా?! అనే ప్రశ్నే వ్యర్ధం! ఒక విషయాన్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు చాలామందే ఉంటారు. వాదోపవాదాలు చేసుకుంటూ, ఒకరిపై ఒకరు నిందలు మోపుకుంటూ కాలం వెల్లబుచ్చుతుంటారు.

                                 పరమహంస యోగానంద జీవితంలో జరిగాయని అయన ఆత్మకథలో ప్రచురితమైనవి నిజాలో, కావో నాకు తెలియవు కానీ... నాకు మాత్రం కొన్ని బలమైన సాక్ష్యాలనిచ్చాయి. కొన్ని వాఖ్యాలు  ప్రగాఢ విశ్వాసాన్ని కలిగించాయి. ఏ విషయాన్నైనా ఇతరులకు చెప్పి నమ్మిన్చాలనుకునే వాళ్ళు ఆ విషయం నిజమేనని కొన్నిసార్లు ఋజువు చేయల్సికూడా వస్తుంది. అలా కొన్ని ఋజువయ్యాయి నా విషయంలో! 

                               ఏ మనిషీ బౌతిక సుఖాలను, సౌఖ్యాలను త్యజించి అంతరాత్మను స్మరించుకుంటూ అనంతాత్మలో కలవలేడు. అలా చేయడానికి ఏ మనిషికైనా కొన్ని వేల లేదా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. మనిషికి బౌతిక జీవనంపై మోహం తగ్గినపుడే అనంతాత్మలో ఐక్యమవ్వాలనే ఆలోచన పుడుతుంది. అ ఆలోచన వచ్చినపుడే అన్వేషణ మొదలవుతుంది.అన్వేషనలోనే అనంతంలో లీనమవడానికి మన అడుగులు ముందుకు పడతాయి. అలా నా అడుగులు అన్వేషణ వరకు మాత్రమే రాగలిగాయి. 
                      
                              ఏమీ తెలియదనుకునే చీకటి వైపు లేదా అంతా తెలుసు అనుకునే వెలుగు వైపు, ఎటు వెళ్ళినా చివరకు చేరే గమ్యం అదే కదా! 
అంతా అనంతమే కదా!!

-భార్గవి కులకర్ణి 

Friday, 16 November 2012

వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం, దేవరకొండ

 వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం, దేవరకొండ, నల్గొండ (జిల్లా) 



















మార్కండేయ స్వామి మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలు, దేవరకొండ

మార్కండేయ స్వామి మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలు,             కొండ మల్లేపల్లి రోడ్, దేవరకొండ, నల్గొండ (జిల్లా)


దేవాలయానికి దారి

ఆంజనేయ స్వామి వారి దేవాలయమ్ 


విజ్ఞేశ్వర స్వామి 






స్వయంభు శ్రీ ఆంజనేయస్వామి 







మార్కండేయ స్వామివారి దేవాలయం 


కొండ చెరియ నుండి వస్తున్న నీరు 


నిర్మాణ దశలో ఉన్న ఆలయం 



















కోనేరు