భజగోవింద శ్లోకములు
శ్రీ శంకరాచార్యులు ఉపదేశించిన
గోవింద ద్వాదశ మంజరికా స్తోత్రము
భజ గోవిందం భజ గోవిందం
గోవిందం భజ మూఢమతే!
సంప్రాప్తే సన్నిహితే కాలే
నహి నహి రక్షతి డుకృణ్ కరణే! ౧
తా!! గోవిందుని భజింపుము. ఓ మూఢ మతీ! గోవిందుని భజింపుము. గోవిందుని సేవింపుము. మరణ కాలం ఆసన్నమైనప్పుడు నీవు వల్లెవేస్తున్న "డుకృణ్ కరణే" అన్న వ్యాకరణ పాటములు నిన్ను రక్షించలేవు.
మూఢ జహీహి ధనాగమ త్రు ష్నాం
కురు సద్బుద్ధిం మనసి విత్రుశ్నాం!
యల్లభసే నిజ కర్మోపాత్తం
విత్తం తేన వినోదయ చిత్తం!! ౨ భజ!!
తా !! ఓ మూడుడా ధనమును సంపాదించాలన్న పేరాశను విడువు. తృష్ణ రాహిత్యమను సద్బుద్ధిని అలవరచుకోనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో మనసును తృప్తిపరచుకొనుము.
నారీస్తనభరనాభీ దేశం
దృష్ట్వా మగ మోహావేశం,
ఏతన్మాంసవ సాదివికారం
మనసి విచిన్తయ వారంవారం. ౩ భజ!!
తా !! స్త్రీల వక్షోజములతో నిండిన నాభి ప్రదేశమును చూసి మొహావేశామును పొంధకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు తాదితర పదార్ధాల వికారమేనని మనస్సులో మాటి మాటికి తలపోయుము.
నళినీదళ గతజల మతితరళం
తద్వజ్జీవిత మతిశయ చపలం,
విద్ధి వ్యాధ్హ్యభిమానగ్రస్తం
లోకం శోకహతం చ సమస్తం. ౪ భజ!!
తా !! తామరాకుపై ఉన్న నీటిబిందువు చలించుచునే ఉండును. అదే విధంగా జీవిథమెన్థో చంచలమైనది. లోకులందరు రోగముతో బాధపడుతూ, దేహాభిమానమును విడువక, దు:ఖములో చిక్కుకొని ఉందురు. మనుష్యునకు సుఖమే లేదని తెలుసుకొనుము.
యావద్విత్తో పార్జనసక్త
స్తావన్నిజ పరివారో రక్త:,
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కో పి న పృచ్చతి గేహే. ౫ భజ!!
తా !! ధనమును సంపాదిస్తున్నంత వరకే నీ పరివార జనము నీపట్ల అనురాగము చూపిస్తారు. ముసలితనమున ని దేహము శిథిలమై శక్తి విహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించే వారు కూడా ఉండరు.
స్తావన్నిజ పరివారో రక్త:,
పశ్చాజ్జీవతి జర్జరదేహే
వార్తాం కో పి న పృచ్చతి గేహే. ౫ భజ!!
తా !! ధనమును సంపాదిస్తున్నంత వరకే నీ పరివార జనము నీపట్ల అనురాగము చూపిస్తారు. ముసలితనమున ని దేహము శిథిలమై శక్తి విహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించే వారు కూడా ఉండరు.
యావత్పవనో నివసతి దేహే
తావత్ ప్రుచ్చతి కుశలం గేహే,
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ౬ భజ!!
తా !! శరీరములో ఉపిరి ఉన్నంత వరకు ఇంటిలోని వారు కుశాలమును విచారిస్తారు. ఆ ఉపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు ఆ కలేభారమును సమీపించుటకు భార్య కూడా భయపడును.
అర్థమనర్థం భావయ నిత్యం
నాస్తి తతస్సుఖలేశ స్సత్యం ,
పుత్త్రాదపి ధనభాజాం భీతి
స్సర్వత్రైశా విహితా రితి: ౭ భజ!!
నాస్తి తతస్సుఖలేశ స్సత్యం ,
పుత్త్రాదపి ధనభాజాం భీతి
స్సర్వత్రైశా విహితా రితి: ౭ భజ!!
తా !! దానం ఎల్లప్పుడూ అనర్తమునే కలిగించునని గ్రహిమ్పుము. ధనము వలన సుఖము లేశమైననూ కలుగదు. ఇది సత్యము. ధనవంతులు పుత్రుని వలన కూడా భయపడతారు. ప్రపంచమంతా ఈ రీతిగానే ఉన్నది.
బాలస్తావత్ క్రీడాసక్త
స్తరునస్తావ త్తరుణీసక్థ:
వృద్ధస్తావ చ్చిన్తా సక్త:
పారే బ్రాహ్మణి కో పి నసక్త: ౮ భజ!!
స్తరునస్తావ త్తరుణీసక్థ:
వృద్ధస్తావ చ్చిన్తా సక్త:
పారే బ్రాహ్మణి కో పి నసక్త: ౮ భజ!!
తా !! బాల్యమంతా ఆటల్లో ఆసక్తి చేత, యౌవనమంతా స్త్రీ వ్యామోహము చేత, వార్ధక్యమును సంసార చింతల చేత, జీవితమ్ అంతా గడుపుడురే కానీ పరబ్రహ్మము నందు ఆసక్తి గలవరేవ్వరును లేరు!
కాతే కాంతా కస్తేపుత్ర
సంసారో య మతివ విచిత్ర:,
కస్య త్వం క:కుత అయాత:
తత్త్వం చిన్తయ తదిహ భ్రాత:, ౯ భజ!!
సంసారో య మతివ విచిత్ర:,
కస్య త్వం క:కుత అయాత:
తత్త్వం చిన్తయ తదిహ భ్రాత:, ౯ భజ!!
తా !! ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు ని పుత్రుడు? వారికి, నీకు ఉన్న సంబంధమేమి? నివేవరావు? ఎక్కడ నుంచి వక్చ్చావు? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వాన్ని ఆలోచించి తెలుసుకో!