గురువు
గురువు మన ఆధ్యాత్మిక వికాసానికి ఒక సాధనం వంటి వారు. గురువు అంటే ఎవరు? గురువు ఎలా వుండాలి? అనే విషయం గురించి కల్పనాలోకంలోకి వెళ్ళకండి. గురువు యొక్క అవసరం మనకుంది. నాకు బాహ్యంగా గురువు అవసరం లేదు అనుకోవచ్చు. అయితే నాకు అంతర్వాణి రూపంలో చెప్తున్నది నా మూర్ఖత్వం వలన, వినిపించుకోకపోవడం వలన బాహ్య రూపంలో వచ్చి నాకు చెప్పడానికి, గురువు అవసరం. నా హృదయంలోనే ఎప్పటికీ ఉండే జ్ఞానాన్ని, నా కన్నులతో ఆ జ్ఞానాన్ని చూడలేని నాకు, అతడు తన కన్నులతో నా కన్నుల ద్వారా చూపించవలసిన అవసరం ఉంది. అందుకు గురువు ఎంతో అవసరము. అ జ్ఞానమే కనుక నాలో లేకపోతే నా అస్తిత్వమే ఉండేది కాదు. ఇది ఒక సత్యం!
- శ్రీ పార్ధసారధి రాజగోపాలాచారి.
No comments:
Post a Comment